Ganesh Birth Story - Telugu
పురాణాల ప్రకారం ఒక రోజు శివుడి నివాసమైన కైలాసంలో గౌరీకి దగ్గరగా కాలకేయులు, ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతి దేవి స్నానం చేయాలనుకున్నారు. ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చొండి బెట్టి స్నానానికి వెల్లాని అనుకుంటుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడింది.
అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది. విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతోనే ఆ విగ్రహమూర్తికి గణేశ అని పేరు పెట్టింది. తర్వాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరించింది. ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను. ఎవరినీ లోపలికి రానివ్వకండి అని చెబుతుంది.
అంగీకరించిన గణేష్ ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడుతాడు. అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు. లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేశుడు శివుడిని లోపలికి వెళ్ళడానికి అనుమంతించకుండా ఆపుతాడు. శివుడు పార్వతి దేవి పతిదేవుడనే విషయం గణేశుడికి, గణేశుడు పార్వతి దేవి సృష్టించి కుమారుడని శివుడికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశ ద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేశుడిపై ఆ పరమేశ్వరుడు ఆగ్రహావేశాలకు గురయ్యై అతడి తలను నరికివేస్తాడు.
బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు. భటులు ఉత్తర దిక్కున్న పడుకున్న వ్యక్తి తల కోసం వేతుకుతారు. అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. శివ శిశువు మీద ఏనుగు తలను స్థిరపెట్టి, అతనికి తిరిగి జీవం పోస్తాడు.
Source:https://telugu.oneindia.com/how-was-lord-ganesh-born-what-is-the-history-of-ganesh-chathurthi-cs-301582.html